12 గంటల లోపు పూర్తిస్థాయి నివేదికలు అందజేయ్యాలని అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఏలూరు, మేజర్ న్యూస్: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాధికార కమిటీ కోరిన మరింత సమాచార నివేదికలు, డిజిటల్ మ్యాపులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సంబంధిత అధికారులతో అధ్యయనం చేసి, మండలాలు వారీగా సుదీర్ఘoగా సమీక్షించారు. సమర్పించిన నివేదికలు శాఖలు వారీగా మరియొక్క సారి రాత్రికి, రేపు ఉదయం ఒక్కటికి నాలుగు సార్లు పూర్తిస్ధాయిలో అధ్యయనం చేసి రేపు ఉదయం 10:30 గంటలకు పూర్తిస్థాయి నివేదికలు అందజేయ్యాలని అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యలు పరిష్కారం, జిరాయితీ, డి-పట్టాదారుల పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీం కోర్ట్ సాధికార కమిటి కి సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై సుప్రీం కోర్ట్ సాధికార కమిటి పరిశీలించి మరికొంత సమాచారం కోరిందని ప్రస్తుత సంరక్షణ కేంద్రం యొక్క విస్తీర్ణం, సంరక్షణ కేంద్రం సరిహద్దులు హేతుబద్ధీకరణ తర్వాత, అన్ని వివరాలతో కూడిన విస్తీర్ణ నివేదిక ప్రభుత్వ, జిరాయితీ, డి-పట్టా భూములు, అభయారణ్యం హరిహద్దులు హేతుబద్దీకరణ, సంరక్షణ కేంద్రం సరిహద్దులు హేతుబద్ధీకరణ తర్వాత, అన్ని వివరాలతో కూడిన విస్తీర్ణ నివేదిక, అభయారణ్యంలోని జిరాయితీ దారులు తరలింపుపై మండలాలు వారీగా తరలింపుపై యుద్ధప్రాతిపదికన భూములు వివరాలు, జిల్లా మండలాలు సరిహద్దులు, ప్రభుత్వ భూములు, జిరాయితీ భూములు, డి-పట్టా భూములు, ఉప్పెటేరుతో సహా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పక్షులు ప్రాంతాలు, అభయారణ్య పరిధిలో నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ డ్రైన్లు వంటి పలు అంశాలను కేంద్ర సాధికార కమిటి సమాచారాన్ని కోరిందని తెలిపారు. వాటిపై సవివరమైన నివేదికలు ఈ రోజు సంబంధిత శాఖలు అధికారులు, మండలాలు అధికారులు సమర్పించిన నివేదికలు వీటన్నింటిపై సమగ్రంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ రోజు రాత్రికి, రేపు ఉదయం ఒక్కటికి నాలుగు సార్లు పరిశీలించి, రేపు ఉదయం ఇవ్వాలని ఆదేశించామని, 06వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించ నున్నామని జిల్లా కలెక్టరు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి జిల్లా అటవీశాఖ సిసిఫ్ జ్యోతి, ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ఏ.రామచంద్రమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి డా.ఏ. త్రిమూర్తులు రెడ్డి, ఆయా మండలాలు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, డివిజన్, మండల సర్వేయర్లు, ఇరిగేషన్, అటవీశాఖ, విద్యుత్తు శాఖ, మత్స్యశాఖ, పోలీసు, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.