|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 07:44 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన మద్దతు ఉంటుందని ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.నవీన్ యాదవ్ యువకుడని, సేవా నిరతి కలిగిన వ్యక్తి అని సుమన్ కొనియాడారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో తన మద్దతు నవీన్‌కు ఎప్పుడూ ఉంటుందని, ఆయనను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. "ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్" అని ఆయన ముగించారు.