|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 12:45 PM
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని కోరుతూ, ఒక్కో కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు.
అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని హరీశ్ రావు విమర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.