|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 12:43 PM
కేసీఆర్ కు ఏమి ఆలోచన వచ్చిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2 నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్సులు ఇచ్చి ఆరు వేల మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని వారి స్వార్థం కోసం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారని, కేసీఆర్ పాలనను ఉద్దేశించి ఆయన విమర్శించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే ఆ దొరలను ఫామ్ హౌస్‌కు పరిమితం చేశారని అన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు త్వరలో బయటపడతాయని ఆయన అన్నారు.