విద్యార్థులకు మంచి భోజనం అందించాలి
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
విద్యార్థులకు పోషక విలువలు కలిగిన మంచి భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి జి వినోద్ కుమార్ ఆదేశించారు. పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామంలోని పియంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శన
మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పి. వీరస్వామి, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి శిరీష ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.