విబిజి రామ్ జి పనులను సద్వినియోగం చేసుకోవాలి_అవుసలికుంట సర్పంచ్ కోడావత్ మంగమ్మ
విబీజీ రాంజీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
అవుసలికుంట సర్పంచ్ కోడావత్ మంగమ్మ
చెంచు గిరిజనులకు విబిజి రాంజీ పనులపై అవగాహన
లింగాల, సూర్య న్యూస్: స్థానికంగా ఉపాధి కల్పించి వలసల నివారణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విబిజి రాంజీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోడావత్ మంగమ్మ అన్నారు. మండల పరిధిలోని ఆవుసలికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, ఎంపీడీవో విజయలక్ష్మి సూచనల మేరకు గ్రామ సర్పంచ్ కోడావత్ మంగమ్మ అధ్యక్షతన చెంచు కుటుంబాలకు ప్రత్యేక గ్రామసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచు గిరిజనులకు విబిజిరామ్ జి గ్రామీణ ఉపాధి పనులపై అవగాహన కల్పించి, దళారుల మాటలను నమ్మి వలసలకు వెళ్లకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడావత్ మంగమ్మ, ఉప సర్పంచ్ చాపల మధు, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్, వివో ఏ శారద, వార్డు సభ్యులు మషన్న, సంగిశెట్టి గౌతం కుమార్ ,వీటిడిఏ అధ్యక్షులు నిమ్మల కురుమయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.