BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

వట్టెంల గ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడు వెంకటేష్ పార్థివదేహం

Select Suryaa Now
వట్టెంల గ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడు వెంకటేష్ పార్థివదేహం
సూర్య వేములవాడ రూరల్ :వేములవాడ రూరల్ మండలానికి చెందిన గంగిపల్లి వెంకటేష్ మృతదేహం శుక్రవారం స్వగ్రామమైన వట్టెంలకు చేరుకుంది. ఈ నెల 1వ తేదీన దుబాయ్‌లో వెంకటేష్ హఠాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని వేగంగా భారతదేశానికి రప్పించేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి చొరవతోనే వెంకటేష్ భౌతికకాయం స్వల్ప వ్యవధిలోనే స్వగ్రామానికి చేరిందని బీజేపీ నాయకుడు మంద రాజేందర్ గౌడ్, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ ఘటన నిరూపించిందని పేర్కొన్నారు.