వరిగుంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో కార్పెడ్ స్వచ్ఛంద సంస్థ సలహాతో పనిచేస్తున్న సహన సంస్థ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ పుట్టగళ్ల మోహన్ సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలనే ప్రధాన లక్ష్యంతో సహన సంస్థ పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆసక్తి చూపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామాన్ని బాల కార్మికులు లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్టగళ్ల మోహన్ మాట్లాడుతూ.. బడిఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండేలా కృషి చేస్తున్న సహన సంస్థ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాంచ వీరేశం, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్మికులు పెంటయ్య, అనిల్, లక్ష్మణ్, నర్సింలు, శేఖర్, సహన సంస్థ ప్రతినిధులు సత్యనారాయణ, సాతెల్లి నరేష్, మంజుల, శ్రీకాంత్, సుజాత, మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తమన్నా రెడ్డి, డాక్టర్ నందిని నాయుడు, నర్సులు పావని, నందిని, మార్కెటింగ్ మేనేజర్ నాగప్ప, సురేష్ తదితరు