BREAKING
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు. రాయికోడ్ మండల ప్రజలందరికీ విజయదశమి దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ మహబూబ్ పటేల్

వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత

Select Suryaa Now
వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత

సూర్య  ఖానాపూర్ :నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి 8 వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎఫ్ డీ వో కడారి అనిత జెండా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయం నుండి కొమురం భీం చౌరస్తా మీదుగా తర్లపాడు,సత్తెనపల్లి,దిలావర్పూర్, ఖానాపూర్ వరకు ర్యాలీ చేపట్టి వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా, తర్లపాడులో మానవహారం పాటించి వన్య ప్రాణుల మనుగడ పెంపొందించాలని అవగాహన కల్పించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎఫ్ డీ వో కడారి అనిత మాట్లాడుతూ, వన్యప్రాణులను హతమార్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ అటవీ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎఫ్ ఆర్ వో కిరణ్ కుమార్, ఖానాపూర్ డివిజన్ పరిధిలోని కడెం, పెంబి, దస్తురాబాద్, మామడ మండలాల ఎఫ్ ఎస్ వో లు, బీట్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.