కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి
కడప మేయర్ కాంగ్రెస్ అభ్యర్థిగా అలి జహనార బేగం
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం: నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్
కడప, ప్రతినిధి, వేణు.
కడప నగర కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి అలి జహనార బేగంను పార్టీ ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి చేతుల మీదుగా సోమవారం సయ్యద్ గౌస్ పీర్ బీఫామ్ అందుకున్నారు.నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో సయ్యద్ గౌస్ పీర్ కీలకంగా వ్యవహరించారని, ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యారు . రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేసేలా నగరంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ, మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేశామని, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నగరానికి మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ విలువైన ఓటుతో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కాంగ్రెస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సయ్యద్ గౌస్ పీర్ హామీ ఇచ్చారు.
సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
తనకు సహకారం అందించిన ఏఐసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ నాయకులు, డీసీసీ విభాగాల నాయకులు, యువజన కాంగ్రేస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కేకేసీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అన్ని డివిజన్ల ఇన్‌ఛార్జీలు, పార్టీ అనుబంధ విభాగాలు మరియు వివిధ సెల్స్ నాయకులకు సయ్యద్ గౌస్ పీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.