telangana
వజ్రేష్ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు
ఘట్కేసర్, మేజర్ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బోడుప్పల్‌లోని దేవి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.