చింతల్గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్
కోహిర్;కోహిర్ మండలం చింతల్గట్టు గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ బంటు విద్యాసాగర్ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర ప్రేమాభిమానాలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపాలని, గ్రామంలో శాంతి వెల్లివిరియాలని సర్పంచ్ బంటు విద్యాసాగర్ ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.