అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాలి దాదా గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా వైద్య రంగంలో ప్రజలకు సేవలందిస్తున్నానని తెలిపారు. మేయర్‌గా ఎన్నికైతే నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, పైవంతెనల నిర్మాణం, 14 కిలోమీటర్ల వలయాకార రహదారి ఏర్పాటు, తాగునీరు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దోమలు, పందులు, వీధి కుక్కల బెడదను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.