శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి
రాయికోడ్;మండల కేంద్రమైన రాయికోడ్ లో వెలిసిన శ్రీ ముమ్మదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 9వ రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయికోడ్ మునిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతుర్ సుధాకర్ రెడ్డి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండల గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.ఈ యొక్క కార్యక్రమంలో రాయికోడ్ మునిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతుర్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేదార్నాథ్ పాటిల్, మాజీ మండల అధ్యక్షులు నర్సింలు, కుస్నుర్ గ్రామ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ యుత్ మాజీ అధ్యక్షులు ప్రభాకర్,రఫీక్, కురుమ రాజు తదితరులు పాల్గొన్నారు,భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.