అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాయికోడ్;చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా అందోల్ నియోజకవర్గం ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందోల్ నియోజకవర్గం అద్భుతమైన ప్రగతి పథంలో ముందుకు సాగిందని పేర్కొన్నారు దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, ఆనందం, ఆత్మవిశ్వాసం, విజయాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, చెడు ఎంతటి శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచికే దక్కుతుందనే గొప్ప సందేశాన్ని విజయదశమి అందిస్తుందని తెలిపారు. ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు విరజిమ్మాలని,ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు సొంతం కావాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, కుటుంబాల మధ్య ప్రేమానురాగా పెంపొందాలని,సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని కోరుకున్నారు. ప్రజల ఆశయాలు నెరవేరి, ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి, సంక్షేమం, సంతోషం నిండాలని ఆకాంక్షిస్తూ, అందోల్ నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.