BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

Select Suryaa Now
ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ భాష, మరో ఇద్దరు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి సోమవారం జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో పాల్గొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, కార్యాలయ ప్రాంగణాన్ని వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆక్రమించి, అభ్యర్థులను ఆఫీసు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఒక్కొక్క అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, కార్యాలయ ప్రాంగణంలో వందలాది సంఖ్యలో గుమిగూడిన టీడీపీకి సంభందించిన మనుషులు బెదిరిస్తూ, ప్రధాన కార్యాలయంలోకి వెళ్లకుండా భౌతికంగా అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ భాష మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ల పరిశీలన వంటి కీలకమైన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన పార్టీ, అధికార బలాన్ని ఉపయోగించి, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, ప్రతిపక్ష అభ్యర్థులకు స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని విమర్శించారు. ప్రొద్దుటూరు ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, ఇలాంటి చర్యలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే ప్రజల ముందుకు రావాలి ఇలా అడ్డంకులు సృష్టించడం ఎందుకు? అని టీడీపీ నాయకత్వాన్ని ఇర్ఫాన్ భాష ప్రశ్నించారు. ప్రత్యర్థి అభ్యర్థులను అడ్డుకోవడం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ఎలాంటి రాజకీయ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. ప్రొద్దుటూరు పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా, ప్రొద్దుటూరు అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రజల సమస్యలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా