BREAKING
పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ బ్రిటన్ టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా

వడోని స్కూల్‌కు టీవీ బహుకరించిన సర్పంచ్ సుశీల చౌహన్

Select Suryaa Now
వడోని స్కూల్‌కు టీవీ బహుకరించిన సర్పంచ్ సుశీల చౌహన్
సూర్య ఉట్నూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు సర్పంచ్‌లు ముందుకు రావడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు గజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వడోని మండల పరిషత్ ప్రాథమిక (ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం స్థానిక సర్పంచ్ సుశీల చౌహన్ 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని బహుకరించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సర్పంచ్ చేతుల మీదుగా టీవీని ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు గజేందర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దృశ్య శ్రవణ (ఆడియో-విజువల్) విధానంలో ఆన్‌లైన్ క్లాసులు బోధించడం వల్ల పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని తెలిపారు. మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల భవిష్యత్తును కాంక్షించి ఉచితంగా టీవీని అందించిన సర్పంచ్ సుశీల చౌహన్‌కు పాఠశాల సిబ్బంది, గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, సత్యపాల్, పాఠశాల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.