BREAKING
32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ *కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అక్షిత

Select Suryaa Now
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అక్షిత

 

చింతపల్లి (నల్లగొండ జిల్లా), మేజర్ న్యూస్:

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన అక్షిత జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు భారత జట్టుకు ఎంపికై తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం రోజున అక్షితను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందించారు.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. తన ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆమె తాజాగా భారత జట్టుకు ఎంపికైంది.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అక్షిత తన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే అంతర్జాతీయ పోటీల్లోనూ విజయాలు సాధించి మరిన్ని పతకాలు గెలవాలని కోరుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

నవంబర్ 19 నుంచి 23 వరకు శ్రీలంకలో జరగనున్న ఆసియన్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో అక్షిత భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుందని రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ పోటీల్లోనూ అక్షిత తన ప్రతిభను చాటి విజయం సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, ఉప సర్పంచ్ పగడాల వెంకటయ్య, అక్షిత తండ్రి ఆకుల జగతయ్య తదితరులు పాల్గొన్నారు.