BREAKING
మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు ‘యే ప్రేమ్ మోల్ లియా’ మూవీ రివ్యూ: ఆయుష్మాన్ ఖురానా, శర్వరీల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే? చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం నిరుద్యోగులపై బీఆర్ఎస్‌కు మొసలి కన్నీరుః టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఎలిజబెత్ హోమ్స్ నిజస్వరూపంపై ‘యు క్యాన్ సీ ఎవ్రీథింగ్’ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే? క్యూబెక్ మత చిహ్నాల నిషేధ చట్టంపై కెనడా సుప్రీంకోర్టు తీర్పు ముంబై, పుణెలో సంగీత, ఆహార వేడుకల సందడి.. దిల్‌జిత్ దొసాంఝ్, రోలింగ్ లౌడ్ కచేరీలు అమెరికా వైమానిక దళ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాకర్ల దాడి: కీలక డేటాకు ముప్పు! తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాంః మంత్రి పొన్నం నా సినిమాల్లో షాక్ వ్యాల్యూ ఉండాల్సిందే.. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనేదే నా లక్ష్యం: సందీప్ రెడ్డి వంగా వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్ వారణాసిలో నవంబర్ 28న కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

తీగలపల్లి దాడి ఘటనపై జిల్లా ఎస్పీ కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు

Select Suryaa Now
తీగలపల్లి దాడి ఘటనపై జిల్లా ఎస్పీ కు   మాజీ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు

బిఆర్ఎస్ నేతపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలని , లేదంటే  కోడేరు పోలీస్ స్టేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.  కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నేత కన్నారెడ్డి భాస్కర్ రెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నం ఘటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో నిందితులపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయకుండా, కేసు తీవ్రతను తగ్గించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా డీఎస్పీ శ్రీనివాస్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న బీరం హర్షవర్ధన్ రెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-పి.వినయ్ కుమార్,నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్