BREAKING
మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు ‘యే ప్రేమ్ మోల్ లియా’ మూవీ రివ్యూ: ఆయుష్మాన్ ఖురానా, శర్వరీల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే? చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం నిరుద్యోగులపై బీఆర్ఎస్‌కు మొసలి కన్నీరుః టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఎలిజబెత్ హోమ్స్ నిజస్వరూపంపై ‘యు క్యాన్ సీ ఎవ్రీథింగ్’ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే? క్యూబెక్ మత చిహ్నాల నిషేధ చట్టంపై కెనడా సుప్రీంకోర్టు తీర్పు ముంబై, పుణెలో సంగీత, ఆహార వేడుకల సందడి.. దిల్‌జిత్ దొసాంఝ్, రోలింగ్ లౌడ్ కచేరీలు అమెరికా వైమానిక దళ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాకర్ల దాడి: కీలక డేటాకు ముప్పు! తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాంః మంత్రి పొన్నం నా సినిమాల్లో షాక్ వ్యాల్యూ ఉండాల్సిందే.. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనేదే నా లక్ష్యం: సందీప్ రెడ్డి వంగా వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్ వారణాసిలో నవంబర్ 28న కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

దోమల నివారణకు ప్రతి ఇంటి భాగస్వామ్యం తప్పనిసరి: కమిషనర్ రామలింగం

Select Suryaa Now
దోమల నివారణకు ప్రతి ఇంటి భాగస్వామ్యం తప్పనిసరి: కమిషనర్ రామలింగం

కీసర, మేజర్ న్యూస్: దోమల నివారణ కేవలం మున్సిపల్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్ సెయింట్ ఆంథోని గ్రామర్ హైస్కూల్‌లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన ‘చెక్‌–5’ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పరిసరాల్లో దోమలు వృద్ధి చెందే ఐదు ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేసుకోవాలని సూచించారు. నీటి నిల్వ పాత్రలు, పూలకుండీల ప్లేట్లు, కూలర్లు, పాత టైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.అదేవిధంగా దోమల నివారణకు ‘క్లియర్‌–క్లీన్‌–కవర్‌’ అనే మూడు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తొలగించడం, నీటి తొట్టెలు, డ్రమ్ములు, కూలర్లు, పూలకుండీలను వారానికోసారి శుభ్రం చేయడం, తాగునీటి ట్యాంకులు, నిల్వ పాత్రలను గట్టిగా మూతలతో కప్పి ఉంచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి కాలనీలోని ప్రతి ఇంటి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనప్పుడే దోమల రహిత పరిసరాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ సంతోష్, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు భాస్కర్, తిరుపతిరాజు, వార్డు ఎంటమాలజీ సూపర్‌వైజర్లు శ్రీనివాస్, స్వామి, ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.