స్వేరోస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
జఫర్ ఘడ్, మేజర్ న్యూస్, హనుమకొండ లోని కాళోజి కళాక్షేత్రంలో ఈనెల 22వ తేదీన జరుగబోయే స్వేరోస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగాల కుమార్, జఫర్ ఘడ్ మండల కన్వీనర్ కలకోట మనోహర్ లు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో స్వేరోస్ ఆత్మీయ సమ్మేళన వాల్ పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు. మీ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న స్వేరోస్ లు పెద్ద ఎత్తున తరలివంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జనగాం జిల్లా అధ్యక్షులు మాదాపూర్ విజయ్ కుమార్ స్వేరో , స్వేరోస్ నెట్వర్క్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సందీప్, స్వేరోస్ సీనియర్ నాయకులు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సురేష్, జాఫర్ఘడ్ ,జనగామ జిల్లా