BREAKING
మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి

సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Select Suryaa Now
సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్


సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
( కిరణ్ కుమార్ ఆరిక)

సింగరేణి కార్మికులకు, అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మండల రాజమహే దయానంద్ అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాగమయి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
గతంలో సింగరేణి అధికారులకు మాత్రమే బోనస్ లు ప్రకటించారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు కూడా బోనస్ ఇస్తుందని అన్నారు. దసరా పండుగలోగా సింగరేణి అధికారులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారని అన్నారు. సింగరేణి బ్లాక్ 3 సమస్యను  వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని, బ్లాక్ 3 ను సింగరేణి కి అప్పగించేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించామని తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీ సింగరేణి బాధితులకు స్థలం సేకరించి ఆర్ అండ్ ఆర్  ప్యాకేజీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరగా సింగరేణి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక  పరికరాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో వైద్యం అందించేందుకు సింగరేణి  సంస్థ నిధులు కేటాయించేందుకు సానుకూలత తెలిపారని వివరించారు.