BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

*శ్రీరాములపల్లి జడ్ పి హెచ్ ఎస్ లో పనిచేయని ఫ్యాన్లు, పగిలిన నేలలు, ఆగిన రాగి జావ*

Select Suryaa Now
*శ్రీరాములపల్లి జడ్ పి హెచ్ ఎస్ లో పనిచేయని ఫ్యాన్లు, పగిలిన నేలలు, ఆగిన రాగి జావ*

*మన బడి – మన హక్కు' కార్యక్రమంలో వెలుగుచూసిన వాస్తవాలు*

*కోహెడ మేజర్ న్యూస్*

శ్రీరాములపల్లి: కొమురం భీమ్ వర్ధంతి స్ఫూర్తితో అక్టోబర్ 26న ప్రారంభమైన 'మన బడి – మన హక్కు' కార్యక్రమంలో భాగంగా, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏ ఐ ఎస్ ఫ్, ఏ ఐ వై ఫ్ నాయకులు సందర్శించారు. మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.
పరిశీలనలో అనేక సమస్యలు బయటపడ్డాయి:
పాఠశాలలో సుమారు 90 శాతం ఫ్యాన్లు పనిచేయడం లేదు. విద్యార్థులు ఉక్కపోతలో తరగతులకు హాజరవుతున్నారు.
కొన్ని తరగతి గదుల్లో నేల పగిలిపోయి ప్రమాదకరంగా ఉంది.
ఆటస్థలం పిచ్చిమొక్కలు, ఎండిన గడ్డితో నిండి ఆటలకు అనువుగా లేదు. పొడవైన గడ్డిలో పురుగులు, పాముల ప్రమాదం ఉందని, ఇది విద్యార్థుల భద్రతకు ముప్పని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
గురువారం ఇవ్వాల్సిన రాగి జావ, రాగి పిండి సరఫరా కాకపోవడంతో నిలిపివేశారు.
ప్రభుత్వం పోషకాహారం కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, ఆ ప్రయోజనం పేద విద్యార్థుల కంచం వరకు చేరడం లేదనడానికి ఇదే నిదర్శనమని నాయకులు విమర్శించారు. సర్కారు బడుల్లో చదివేది పేద, బడుగు వర్గాల పిల్లలేనని, వారి పట్ల నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ఫ్యాన్ల మరమ్మతు, నేల పునర్నిర్మాణం, ఆటస్థలం శుభ్రత, రాగి జావ సరఫరా పునరుద్ధరణ తక్షణమే చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, పౌష్టికాహారం విద్యార్థుల హక్కు అని, దాని సాధనే ఈ కార్యక్రమ లక్ష్యమని నాయకులు తెలిపారు. కోహెడ మండలంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారం కాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఫ్  కోహెడ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్, ఏ ఐ ఎస్ ఫ్ మండల కార్యదర్శి కందుకూరి మహేష్, ఏ ఐ ఎస్ ఫ్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సిపిఐ నాయకులు ఎర్ర శ్రీనివాస్, రామ్ ప్రసాద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.