సూర్య నిర్మల్ ప్రతినిధి:నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, సూర్జాపూర్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 22వ తేదీ గురువారం నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఉత్సవాలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వానించారు.