BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Select Suryaa Now
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

 

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అహ్మదాబాద్ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందనే హెచ్చరిక అందడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు మరియు సీఐఎస్‌ఎఫ్‌ (CISF) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే భద్రతా నిబంధనల ప్రకారం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించి, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.