పోలీసులు ఆయుధపూజలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ....
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీ రాహుల్ మీనా.... అమలాపురం, మేజర్ న్యూస్ అక్టోబర్ 20: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదట దుర్గాదేవి చిత్రపటానికి పూజలు చేసిన ఎస్పీ, అనంతరం పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచిన విధి నిర్వహణకు వినియోగించే వివిధ రకాల ఆయుధాలకు పూజలు చేశారు. పోలీసు శాఖకు చెందినi మోటారు వాహనాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జిల్లా ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ జి.యు.కె.ఎల్.వి. సుబ్బరాజు, అమలాపురం టౌన్ ఇన్‌స్పెక్టర్ పి.వీరబాబు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మానందం, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.