BREAKING
అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు!

కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

Select Suryaa Now
కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

కల్వకుర్తి, సూర్య ప్రతినిధి :నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) మల్లు రవి, కల్వకుర్తి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.