BREAKING
పులిరామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా బన్నే పూర్ణ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి భీమవరం జెడ్పీటీసీగా కత్తుల సిరి మహాలక్ష్మి, వీరవాసరం ఎంపీపీగా భోగిరెడ్డి శ్రీనివాసరావు విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి 'చెప్పాం – చేస్తున్నాం' బ్రోచర్ ఆవిష్కరణ: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం – టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వర రావు విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధ, వాహన పూజలు పోలీసు శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్ నాగరాణి కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకి బి-ఫారం : అందజేసిన ఎమ్మెల్యే జహా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మెట్లకుంటలో దుర్గామాత చీర రూ.30 వేలకు వేలం.. దక్కించుకున్న చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు ఇల్లెందు లోరాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు -అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు...... అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ చెరుకులపాడులో వైఎస్ఆర్సీపీ ఐడీ కార్డుల పంపిణీ దసరా పర్వదినోత్సవాన.. జమలాపురం వేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రి పొంగులేటి కుటుంబం ప్రత్యేక పూజలు దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి.. నారాయణపురంలో పండుగ సందడి భక్తిశ్రద్ధలతో..రేజర్లలో శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం దుర్గా నాగమల్లేశ్వర స్వామికి మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు విజయదశమి సందర్భంగా అఖండ అన్న సమారాధన ప్రారంభం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభం

స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

Select Suryaa Now
స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు


 

 బుచ్చి మేజర్ న్యూస్ :
 11వ వార్డులో 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక స్థానిక ఎన్నికల వేళ కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. మంగళవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ 11వ వార్డులో నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో 100 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వైసీపీ నాయకులు ఆళ్లపాక లక్ష్మయ్య, ఆళ్లపాక శేషయ్య సహా పలువురు టీడీపీలో చేరారు. రాష్ట్ర టీడీపీ మైనారిటీ విభాగం కార్యదర్శి షేక్‌ జాఫర్‌ బాషా, 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ జఫ్రుద్దీన్‌ ఆధ్వర్యంలో టీడీపీ బుచ్చిరెడ్డిపాళెం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పాల్గొని, పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గారు.. పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే మూడు నెలల్లో ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నెల్లూరులో వైసీపీ సీనియర్‌ నాయకుల చేరిక
మంగళవారం సాయంత్రం నెల్లూరులోని ఎమ్మెల్యే గారి స్వగృహంలో వైసీపీ సీనియర్‌ నాయకులు సర్దార్‌, బషీర్‌ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు షేక్‌ రహ్మత్‌ బాషా, మహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బషీర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి పూర్తి మద్దతు అందిస్తామని వారు తెలిపారు.

ఉదయం 15 మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి
మంగళవారం ఉదయం నెల్లూరులోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నివాసంలో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన 15 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌, ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన వారికి ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కొడవలూరు నుంచి 50 మంది వైసీపీ కార్యకర్తల చేరిక
మంగళవారం సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో కొడవలూరు టీడీపీ నాయకుడు గరికపాటి రాజేంద్ర ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానించి, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు.

పెద్దూరుకు చెందిన విజయ భాస్కర్‌రెడ్డి అనుచరులతో కలిసి టీడీపీలోకి
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని పెద్దూరుకు చెందిన వైసీపీ నాయకుడు విజయ భాస్కర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మంగళవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాళెం 2వ వార్డులో నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసిన ఆయన, తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. 
కోవూరు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతుండటంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు.