ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు
శామీర్‌పేట్, మేజర్ న్యూస్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భవానీ అమ్మవారిని, జమ్మి చెట్టును ప్రార్థించినట్లు తెలిపారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.