క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు
బషీరాబాద్, మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఐకమత్యంతో పాల్గొని జమ్మి పూజలు, అలాయ్ బలాయ్ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ముందుగా జమ్మి చెట్టు వద్ద గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అలాయ్ బలాయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఇలాంటి పండుగలు గ్రామ ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లారెడ్డి, మాణిక్ రెడ్డి, రాజు పటేల్, జి. ప్రభాకర్ రెడ్డి, కుర్వ జగన్నాథం, బి. రవికుమార్, హెచ్. రవికుమార్, గ్రామ ముఖ్యులు, వార్డు సభ్యులు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్:పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.