BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు

Select Suryaa Now
అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు

నాగర్‌కర్నూల్, సూర్య ప్రతినిధి :పవిత్ర విజయదశమి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, అర్చకుల నుంచి ఆశీర్వచనాలు స్వీకరించారు.

ముందుగా స్వగ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.