అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!
కుల్కచర్ల, మేజర్ న్యూస్: కుల్కచర్ల మండల కేంద్రంలోని మధ్యగేరిలో అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడక వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకను కుల్కచర్ల గ్రామానికి చెందిన నీరటి ఆంజనేయులు రూ.1,16,111కు దక్కించుకున్నారు. అత్యధిక ధరకు వేలంలో సొంతం చేసుకున్న ఆంజనేయులును ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి, అమ్మవారి వస్త్రాభరణాలను అందజేశారు. అమ్మవారిపై భక్తి, విశ్వాసాలతో నిర్వహించిన ఈ వేలం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రిపోర్టర్: వడ్ల వినోద్ కుమార్, కుల్కచర్ల, వికారాబాద్ జిల్లా.