ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు
కుక్కునూర్. మేజర్ న్యూస్ :రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
కుక్కునూరు మండలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో పాటు గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను కుక్కునూరు మండలానికి రావడం జరిగింది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు స్పెషల్ పార్టీ బలగాలు కుక్కునూరులోనే బస చేస్తూ, కుక్కునూరు మరియు వేలేరుపాడు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తాయని
అదేవిధంగా, త్వరలో గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడు తున్నామని
ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక ఎస్ఐ రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు