BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత..

Select Suryaa Now
సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత..

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :నగరంలోని సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో విజయదశమి వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దసరా సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని రావణాసురుడిగా పోల్చుతూ మైదానంలో ఒక కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ నేత మెట్టు సాయికుమార్ తన అనుచరులతో కలిసి వెంటనే అక్కడకు చేరుకుని ఆ కటౌట్‌ను తొలగించారు.

దీంతో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి గొడవ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు పాల్పడిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో మైదానంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.