అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లి పట్టణం,దేవతా నగర్ నందు వెలసిన శ్రీ శ్రీ శ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం మంగళవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ ఏర్పాట్లు చేపట్టారు.
అమ్మవారి ఉత్సవాల్లో భక్తుల సందడి
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు,వినయ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఉత్సవం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులకు,దాతలకు,నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ : నానబాల కుమార్,మదనపల్లి రూరల్