33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం
అమలాపుర, మేజర్ న్యూస్ :మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నూలు రమేష్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దూడల విరీత దేవి పాల్గొని, అభ్యర్థితో కలిసి వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆశీస్సులు కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావుతో పాటు గోపీ రమేష్, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని వేగవంతం చేశారు. వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని అభ్యర్థి ఈ సందర్భంగా ఓటర్లకు హామీ ఇచ్చారు.