శేరిలింగంపల్లి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్
రాయదుర్గం,మేజర్ న్యూస్ : విజయదశమి పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి ప్రజలకు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అన్నింటా శుభం చేకురాలని, ప్రజల జీవితంలో దసరాను మించిన పండుగ లేదన్నారు.దసరా పండుగలో మనసంప్రాదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత మిలితమై ఉందన్నారు.ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు ఎంత శక్తి వంతంగా కనిపిస్తున్నా, చివరికి మంచితనమే విజయం సాధిస్తుందని,దసరా పండుగ దీనిని గుర్తు చేస్తుందన్నారు. చెడు పై మంచి విజయం సాధించిన రోజు విజయ దశమి అన్నారు. విజయ దశమి రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ప్రజల దీవెన ఎల్లప్పుడు ఉండాలని, ఈ దసరా మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నట్లు రవికుమార్ తెలిపారు.