చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్
చార్మినార్, మేజర్ న్యూస్: హైదరాబాద్లోని పాతబస్తీ చారిత్రక కేంద్రమైన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు చారిత్రాలతో చార్మినార్ దగ్గర సమావేశంలో అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొత్త టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఓటు హక్కు ఇన్ఫర్మేషన్ సెక్టార్లో ఎంతో అభివృద్ధి చేసినా గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి అంజన్ కుమార్ యాదవ్, ఫెరోస్ ఖాన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నాయకులు శ్యామ్మోహన్ , సి డబ్ల్యూ మెంబర్ గిడుగు రుద్రరాజు, నాయకులు జి కన్నయ్య లాల్, జి ఆనంద్, పులిపాటి రాజేష్ కుమార్ రాహుల్ రాజేష్ కుమార్ గోపిశెట్టి రాఘవేంద్రరావు ముజాహిద్ హుస్సేన్ బి వెంకటేష్ ముదిరాజ్ శ్యామ్ రావు ముదిరాజ్ మొహమ్మద్ సైఫుల్లా మూతి రోహిత్ ఇంకా అనేకమంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.