BREAKING
8వ వేతన సంఘం: గతంలో 14%.. ఇప్పుడు 140% పెంపు డిమాండ్! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పాత రికార్డులు ఏం చెబుతున్నాయి? టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు: జాతీయ భద్రత పేరిట డ్రాగన్ నిర్ణయం.. భారత మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం! తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా బెల్లం మాధవి: అభినందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న! బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌ అల్లాపూర్‌ దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు! చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

Select Suryaa Now
విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి  ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

మేడ్చల్ ,మేజర్ న్యూస్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, విజయాలను నింపాలని ఆకాంక్షించారు.అమ్మవారి కృపాకటాక్షాలతో ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజల జీవితాల్లో ఆనందాలు నిండాలని కోరుకున్నారు. దసరా పండుగ ప్రజల్లో ఐక్యత, సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలను మరింత పెంపొందించాలని పేర్కొన్నారు. పండుగ స్ఫూర్తితో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటూ సమాజ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఎల్లంపేట అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సంక్షేమమే ధ్యేయం:

ఎల్లంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, స్థానిక సమస్యలను పరిష్కరించడం, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ప్రజల సహకారంతో ఎల్లంపేటను మరింత అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయదశమి ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు మరోసారి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.