శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ
అమీర్‌పేట,మేజర్ న్యూస్:అమీర్‌పేట డివిజనులోని బాపూనగర్ లో దేవీ శరన్నవరాత్రులు భక్తిశ్రద్ధల నడుమ జరుగుతున్నాయి.ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం సేవా భయా సేవా సంఘం బాపూనగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు.మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొని రంగు రంగుల రంగవళికలను వేశారు.భక్తి,సంస్కృతి,సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులను రూపుదిద్దారు.
ఈ పోటీసులకు మాజీ ఎమ్మెల్సీ,వ్యవసాయ కమిషన్ సభ్యులు రాములు నాయక్ హాజరయ్యారు.పోటీలో పాల్గొన్న మహిళలను అభినందించారు.ముగ్గుల పోటీలు మహిళల్లోని సృజనాత్మకతను అద్దం పడతాయన్నారు.అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో శక్తి స్వరూపిణులైన మహిళలను ప్రోత్సహించేలా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో బాపూనగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలు నాయక్,ఉత్సవ కమిటీ నిర్వాహకులు పి.చరణ్ సింగ్,రాకేష్ జాదవ్,కునాల్ రాథోడ్, మదన్ సింగ్,హరి జాదవ్ తదితరులు పాల్గొన్నారు.