BREAKING
8వ వేతన సంఘం: గతంలో 14%.. ఇప్పుడు 140% పెంపు డిమాండ్! ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై పాత రికార్డులు ఏం చెబుతున్నాయి? టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు: జాతీయ భద్రత పేరిట డ్రాగన్ నిర్ణయం.. భారత మెట్రో, రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం! తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా బెల్లం మాధవి: అభినందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న! బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌ అల్లాపూర్‌ దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు! చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం

Select Suryaa Now
జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా     రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని గురుగ్రామ్ అంబియెన్స్ మాల్‌లో ఉన్న ఐస్‌కేట్ వేదికగా అక్టోబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన 8వ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌–2026లో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. బాండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ జట్టు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకంతో పాటు జట్టు ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్ ట్రోఫీని సాధించింది.
జట్టు ఛాంపియన్‌షిప్‌లో హర్యానా రాష్ట్రం 19 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 18 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
తెలంగాణ క్రీడాకారుల పతకాల వివరాలు
అండర్-10 బాలుర విభాగం: హర్యానాతో జరిగిన ఫైనల్లో 0–1 తేడాతో ఓటమి పొంది రజత పతకం సాధించింది.
అండర్-10 బాలికల విభాగం: తమిళనాడుపై 1–0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది.
అండర్-14 బాలుర విభాగం: తమిళనాడుపై 2–0 తేడాతో గెలిచి స్వర్ణ పతకం సాధించింది.
అండర్-14 బాలికల విభాగం: ఉత్తరప్రదేశ్‌తో జరిగిన పోటీలో పెనాల్టీ షూటౌట్ ద్వారా 1–0తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అత్యధిక గోల్స్ సాధించిన తెలంగాణ క్రీడాకారులు
తెలంగాణ తరఫున పి. మిథున (ఎస్ వీ ఐ ఎస్ ), జి. మోక్షిత (అర్ష స్కేటింగ్ అకాడమీ), సంజయ్ స్కృతి (గేమ్ పాయింట్, కొంపల్లి) ఛాంపియన్‌షిప్‌లో అత్యధికంగా మూడు గోల్స్ చొప్పున సాధించి ప్రతిభ కనబరిచారు. బాలుర విభాగంలో సాయి తనిష్, జతిన్ ధీర (అర్ష స్కేటింగ్ అకాడమీ) అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారులుగా నిలిచారు.
క్రీడాకారుల కృషి, కోచ్‌ల మార్గదర్శకత్వం, సహాయక సిబ్బంది సహకారం, జట్టు యాజమాన్యం సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారులను, కోచ్‌లను, జట్టు కార్యదర్శి మహమ్మద్ నసీరుద్దీన్‌ను అభినందించారు