దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : విజయదశమి పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దసరా పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శవంతమైన జీవనాన్ని మనకు గుర్తుచేస్తుందని, వారు పాటించి చూపిన సన్మార్గంలో మనం కూడా ప్రయాణించేందుకు మార్గదర్శనం చేస్తుందన్నారు.మనలోని చెడు ఆలోచనలు వదులుకుంటూ, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు దసరా పండుగ అందరి జీవితాల్లో శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అని రాగం అన్నారు.