షాద్‌నగర్‌లో అయ్యప్ప ఫార్మసీ ప్రారంభం
- ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…..
ఫరూక్నగర్ రంగారెడ్డి
షాద్‌నగర్ పట్టణంలోని విజయ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప ఫార్మసీని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఫార్మసీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మందులను విక్రయించాలని, స్థానికులకు మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత రఘునాథ్ యాదవ్, వాణి పాండురంగ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చిన్న యాదగిరి, కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్, నాయకులు శ్రీకాంత్ గౌడ్, కంసాన్ పల్లి బాల్ రాజ్, కాట సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
నరసింహారెడ్డి మేజర్ న్యూస్…