BREAKING
పరాగ్వే నూతన అధ్యక్షుడిగా పెడ్రో అలియానా ప్రమాణ స్వీకారం నిఖిల్ 'స్వయంభు' సినిమా విడుదలపై తీవ్ర అనిశ్చితి: పాన్ ఇండియా చిత్రాల వలసల వల్ల హీరోలకు తప్పని కష్టాలు అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు

సర్ సిల్క్ కార్మికుల ఇళ్ల జోలికొస్తే ఊరుకోం! - తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Select Suryaa Now
సర్ సిల్క్ కార్మికుల ఇళ్ల జోలికొస్తే ఊరుకోం! -  తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
సూర్య,కాగజ్‌నగర్:  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రాంతంలో సర్ సిల్క్ సంస్థకు చెందిన క్వార్టర్లలో, మరియు సొంతంగా ఇల్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కార్మికులను వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలను ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేయమనడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు పరిశ్రమలకు పేరుగాంచిన కాగజ్‌నగర్‌లో సిర్పూర్ పేపర్ మిల్లు, సర్ సిల్క్ సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పించాయని గుర్తు చేశారు. సర్ సిల్క్ సంస్థ మూతపడినప్పటికీ కార్మికులకు రావాల్సిన బకాయిలు నేటికీ పూర్తిస్థాయిలో అందలేదని అన్నారు. అయినప్పటికీ సుమారు 5 వేల మంది కార్మికులు కంపెనీ క్వార్టర్లలోనే నివాసం ఉంటున్నారని తెలిపారు.ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్న కుటుంబాలకు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరైన చర్య కాదన్నారు. సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన నేపథ్యంలో కార్మికుల నివాసాల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే స్థలం కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వమే పరిహారం అందించి కార్మికుల నివాసాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.నోటీసులు అందుకున్న వారిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదని, స్థానిక నాయకత్వంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.