*సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్*
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సీపీఐ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టి, జ్ఞానేష్ కుమార్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రెహమాన్, పెరబోయిన మహేందర్ మాట్లాడుతూ
స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని, బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని, అధికారం సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. భారత దేశంలో పుట్టిన ప్రతివ్యక్తికి రాజ్యాంగం కులమతాలు, లింగభేదం లేకుండా ఓటు హక్కు కల్పించిందన్నారు. ఒక వ్యక్తి, ఒక ఓటు అనే ప్రాధమిక సూత్రం ప్రాతిపదికన హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఓటు చోరికి పాల్పడుతోందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓట్లను తొలగిస్తూ, తమకు అనుకూలంగా వున్నవారి ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చుతున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న 'సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సైతం దాదాపు యాభై లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, వీటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి కోరారు. అర్హులైన సామాన్యుల, పేదవారి ఓట్లను పునరుద్ధరించి, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు పోరాడుతామని అన్నారు. విద్యార్థులు, యువకులను ఏకంచేసి సంఘటిత ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
డిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన పోరాటానికి వెళ్ళిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్వగురు అని చెప్పుకుంటున్న మోడీ, విద్యార్థులు, యువత చేస్తున్న పోరాటానికి సమాధానం చెప్పే నైతిక అర్హత కోల్పోయాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి ఏషాల అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండీ నయీమ్,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కందుల మధు,ఉప్పల శాంతి కుమార్,ఏఐటియుసి జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు మారుపాక వెంకటేష్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల సాయి కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి బద్ధుల శ్రీనివాస్, బెల్లి శ్రీకాంత్, ఏ ఐ ఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జానీ,కోశాధికారి జిట్టా గౌతమ్, ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు కంబాల వెంకటేష్,గడ్డం భాను కృష్ణ,కనకబోయిన నందు,రచ్చ దయాకర్, కళ్లెం స్వామి,అనంతుల నరసింహ,కంబాల రాజు, శెట్టి నరసింహ,గుండ్లపల్లి మహేష్,లింగస్వామి, ముగ్గు ప్రవీణ్, చింటూ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు శాగ జాను, చెడే ప్రణయ్, చెరుకు లక్ష్మి సాయి,నవీన్ ,రేఖల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*