BREAKING
పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు... కాంగ్రెస్ పార్టీ ప్రచారం విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి... నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా! విభిన్న సంస్కృతులను గౌరవించడం, ఆదరించడమే భారత బలం రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!! ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి బీహార్ ఇక వెనుకబడిన రాష్ట్రం కాదు: నితీష్ సేతుపై మాంఝీ హర్షం

రూ.2.80 లక్షల విలువైన క్లోరో హైడ్రేట్ పట్టివేత 56 కిలోల క్లోరో హైడ్రేట్ స్వాధీనం.. కారుతో సహా సీజ్

Select Suryaa Now
రూ.2.80 లక్షల విలువైన క్లోరో హైడ్రేట్ పట్టివేత 56 కిలోల క్లోరో హైడ్రేట్ స్వాధీనం.. కారుతో సహా సీజ్

సంగారెడ్డి  ప్రతినిధి ;  కల్తీ కల్లు తయారీకి వినియోగించే క్లోరో హైడ్రేట్‌ను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి 56 కిలోల క్లోరో హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పదార్థం విలువ సుమారు రూ.2.80 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన మారుతి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.కల్తీ కల్లు తయారీకి క్లోరో హైడ్రేట్, ఆల్ప్రాజోలం వంటి పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఈ పట్టివేత చేపట్టింది.

కంది వద్ద వాహన తనిఖీల్లో పట్టివేత..

కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు మారుతి కారులో అక్రమంగా క్లోరో హైడ్రేట్ తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో జాతీయ రహదారులపై వాహన తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారి 161, 165 మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కంది గ్రామం వద్ద కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 28 కిలోల చొప్పున రెండు సంచుల్లో మొత్తం 56 కిలోల క్లోరో హైడ్రేట్ లభించింది.కారులో ఉన్న ఉమాకాంత్ గౌడ్ (28)ను అదుపులోకి తీసుకుని విచారించగా, తన బావ తిప్పారం వెంకట్ గౌడ్ (40) హైదరాబాద్‌లో అందజేయాలని ఈ పదార్థాన్ని తనకు ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో వెంకట్ గౌడ్‌పై కూడా కేసు నమోదు చేశారు. విచారణలో వెంకట్ గౌడ్ క్లోరో హైడ్రేట్, ఆల్ప్రాజోలం అక్రమ వ్యాపారంలో పాల్గొంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

కారు, పట్టుబడిన పదార్థం సీజ్..

56 కిలోల క్లోరో హైడ్రేట్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన మారుతి కారును స్వాధీనం చేసుకుని, నిందితుడిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో పాల్గొన్న మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు శ్రీనివాస్, బిజ్జా నాయక్, ఎస్‌ఐ శంకర్, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, మెదక్ డిప్యూటీ కమిషనర్ ఏ. చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ డి. గాయత్రి అభినందించారు.