BREAKING
ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా!

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి - అధికారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశం

Select Suryaa Now
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి - అధికారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశం
సూర్య మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై సీఐ రవీందర్,హాజీపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రహదారికి ఇరువైపులా పెరిగిన పొదలను తొలగించాలని,వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.అలాగే కల్వర్టులను వెడల్పు చేయడంతో పాటు రాత్రివేళల్లో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు,వైట్ పెయింటింగ్,రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని,అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని ఆదేశించారు.పాత మంచిర్యాల నుంచి నగర శివారు ప్రాంతాల వరకు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రహదారి విస్తరణ,డివైడర్ల నిర్మాణానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.లిక్కర్ గోదాం ఎదుట లారీలు, డీసీఎం వ్యాన్లను రోడ్డుకు ఇరువైపులా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని గోదాం మేనేజర్ వాణి జయలక్ష్మికి సూచించారు.వాహనాల కోసం ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కార్పొరేటర్ తూముల నరేష్,జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్,కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.