BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

రెండోసారి బాధ్యతలు.. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కుండ భానుచందర్

Select Suryaa Now
రెండోసారి బాధ్యతలు.. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కుండ భానుచందర్

మేడ్చల్, మేజర్ న్యూస్ : గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కుండ భానుచందర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా కుండ భానుచందర్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అణగారిన వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పార్టీకి, కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా సేవా అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.తనకు రెండోసారి అవకాశం కల్పించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చెన్నయ్య, టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మురళీ, మేడ్చల్ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షుడు పానుగంటి మహేష్ తదితర నాయకులకు కుండ భానుచందర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.