BREAKING
ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జి.రామాంజనమ్మ నామినేషన్ దాఖలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు ముంబైలో సచిన్ టెండూల్కర్‌తో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ సందడి రామాయణ సక్సెస్‌పై ధనుష్ ప్రశంసలు.. సాయి పల్లవి ఆసక్తికర రిక్వెస్ట్! నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు. - సర్వే నంబర్‌ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..! గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

రేకుర్తి 22ఏ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Select Suryaa Now
రేకుర్తి 22ఏ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

సూర్య కరీంనగర్ ప్రతినిధి : రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఇప్పటికే భూములకు సంబంధించిన పాత రెవెన్యూ, మున్సిపల్, సర్వే రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక, పరిష్కార ప్రతిపాదనలను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)కు పంపించినట్లు వెల్లడించారు.ప్రజావాణిలో బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తన ఛాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరం భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. జిల్లా నుంచి పంపిన నివేదిక కేవలం 15 రోజుల్లోనే సీసీఎల్ఏ స్థాయిలో తదుపరి పరిశీలనకు వెళ్లిందని తెలిపారు. అక్కడి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి, అవసరమైతే న్యాయశాఖకు పంపించి తదుపరి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉంటుందన్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సమస్య పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ అంశంపై చర్చిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివిధ న్యాయస్థానాల్లో ఉన్న కేసులు, న్యాయపరమైన చిక్కుల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి సారించామని, భవిష్యత్తులో బాధితులు, వారి వారసులు భూహక్కుల విషయంలో ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు.కలెక్టర్ స్వయంగా సమావేశం నిర్వహించి చర్యలను వివరించడంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.