రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
సూర్య, తెలంగాణ బ్యూరో :వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు, యువతలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గురువారం వరంగల్‌లో ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో పాటు మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, పట్టభద్రులు, యువత కోసం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేసి, ప్రతి పట్టభద్రుడిని కలిసి మద్దతు కోరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రత్యక్ష ప్రచార కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించి అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని నిర్ణయించారు.